Hockey World Cup 2018: India Make Good Start, Beat South Africa 5-0 | Oneindia Telugu

2018-11-29 150

The Manpreet Singh-led side beat South Africa in all the four quarters of the game. Mandeep Singh opened the scoring in the tenth minute of the first quarter. And as Akashdeep Singh scored India's second goal in the 12th minute of the same quarter. Simranjeet Singh was adjudged Man of the Match, who scored two goals for his side.
#HockeyWorldCup2018
#KalingaStadium
#tournament
#indiavsSouthAfrica
#ManpreetSingh
#SimranjeetSingh

భువనేశ్వర్ వేదికగా ఆరంభమైన హాకీ ప్రపంచకప్‌లో భారత్ శుభారంభం చేసింది. భారీ అంచనాల మధ్య టోర్నీలోకి అడుగుపెట్టిన భారత్ తన తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై 5-0తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. కొత్త కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ సారథ్యంలో భారత హాకీ జట్టు ఈ మ్యాచ్‌లో ఆద్యంతం తన దూకుడుని కనబర్చింది.
మ్యాచ్‌లో ఎక్కువ శాతం బంతిని తమ నియంత్రణలోనే ఉంచుకున్న భారత జట్టు పదే పదే దక్షిణాఫ్రికా గోల్‌పోస్టుపై దాడులు చేస్తూ ప్రత్యర్ధి జట్టుని ఉక్కిరిబిక్కిరి చేసింది. దీంతో భారత దాడిని అడ్డుకోవడానికి దక్షిణాఫ్రికాకు సమయం సరిపోయింది. ఈ క్రమంలో ఆ జట్టు కనీసం ఒక గోల్ కూడా కొట్టలేకపోయింది.